తోలిదనంలోని తీయదనం .....



పసితనంలో,
        పడుతూ లేస్తూ వేసే తొలి అడుగు...
         అమ్మా అని పలికే తొలి పదం...
         అ,ఆ లు చదివేటపుడు మన తొలి నేస్తం...
          మాస్టారు వేసిన మొదటి దెబ్బ ...
        ఆటల పోటీలో పోటీపడి గెలిచి ఆనందంతో అమ్మకు చూపించే తొలి ప్రైజు ...
చదువయ్యాక..
        భయం భయంగా హాజరైన మొదటి ఇంటర్వ్యు ...
        గర్వంగా తీసుకునే మొదటి నెల జీతం..
        మొహమాటంగా జరిగే మొదటి పెళ్లి చూపులు...
పెళ్లి తర్వాత,
        పాలు,మురిపాలు పంచుకునే తొలి రేయి...
        మన ప్రతిరూపాన్ని చూసి మురిసిపోయే తొలి క్షణం...
        ´´తోలిదనం అనేది నిద్ర లేచే తొలి నిముషం లాంటిది ...
          లేవాలనిపించదు...లేవక తప్పదు ...´´
        ఎవ్వరికైనా తోలిదనంలోని తీయదనం ఒక్కటే...

నువ్వు ...



నా తీయటి కోరిక నువ్వు....
నేను పారేసుకున్న జ్ఞాపకానివి నువ్వు....
ఈ గుండె కోట శిఖరాల నధిశ్టించిన పతకాన్ని
రెపరెపలాడించే ప్రేమగాలి తెమ్మెరవి నువ్వు .....
--యండమూరి నవల నుండి --

Design by Blogger Templates