అమ్మ ప్రేమ..




నువ్వు మొదటిసారి గర్భాన కదిలినపుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని!
నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది ఉషారయిన వాడివని!
నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది నా ప్రతిరూపానివని!
నా రక్తాన్ని పాలుగా తాగుతుంటె బోలెడంత ఆశ కలిగింది అందరికంటె బలవంతువవ్వాలని!
తప్పటడగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకేలేనంతఆనందం పొంగింది నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!
అడుగుల్లోనే నాకు దూరమయితే ఆశీర్వదించాలనిపించింది గొప్పవాడివవ్వమని!
జీవన వత్తిడిలోపడి నన్ను మరిచిపోతే కొండంత దైర్యం వచ్చింది నేను లేకపోయినా బ్రతగ్గలవని!
ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు త్రుప్తిగా వుంది నీకు తట్టుకునే శక్తివుందని!
ఇప్పుడే నా క్కొంచెం బాధగా వుంది అందరూ నేపోయానని ఏడుస్తుంటే
నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాల్తుందేమోనని....!

స్నేహం..!




ఏ బంధం లేకున్నా అనుబంధాన్ని పంచేది..స్నేహం..!
ప్రేమించకున్నా ప్రేమని పంచేది స్నేహం..!
గాయపడ్డ హ్రుదయాన్ని గగనంలో విహరింపచేసేది స్నేహం..!
అలసిన మనసుని ఆనందంలో ముంచేది స్నేహం..!
నువ్వు నేను అనే భావాన్ని మరిపించేదే స్నేహం..!

SOMETHING

నువ్వంటే ఇష్టమని చెప్పలేను
ఎందుకంటే నీపై నాకున్న భావానికి ఆ వాక్యం సరిపొదు..
ప్రేమ పేరు పెట్టలేను..
ఎందుకంటే అది గుడ్డిది కనుక..
ప్రాణమని అనలేను అది అశాశ్వతం కనుక..
ఇష్టానికి...
ప్రేమకి..
ప్రాణానికి... అందని పదం దొరకడం లేదు
అందుకే నువ్వంటే నాకు SOMETHING

Design by Blogger Templates