అమ్మా....
మది లోని భావాలకు రుపునిచ్చే అక్షరాలను జల్లెడ పడుతున్నా..
నా ఆలోచలను కవితగా మలచాలని...
ఉదయిస్తున్న భానుని నునువెచ్చని కిరణాలు...
నిశీధి సమయాన చందమామ కురిపించే చల్లని వెన్నెల...
తొలకరి జల్లు నేలని ముద్దాడినపుడు వచ్చే కమ్మని మట్టి వాసన...
వసంతంలో చిగురు కొమ్మ మీది నుండి కోకిల పలికే కుహు కుహు రాగాలు...
చిరుగాలికి తలలూపే పచ్చని పైరు...
కడలి తరంగం వినిపించే అలల హోరు..
ప్రకృతి లోని ఈ అందాలన్నీ అమ్మ ప్రేమ లాగానే ఎప్పటికీ శాశ్వతం...! శాశ్వతం...!!
అక్షర
Posted at 11:51 AM | లేబుళ్లు: అమ్మ, poetry | 0 Comments
నీ వెంటే నా పయనం..
జన్మాంతర బంధంలా,ఇరిగిపోని గంధంలా పయనమై వచ్చావా...
నీ ఆలాపనతోనే పరిమళించి ఊహల పూల నడుమ దవనంలా నీ నవ్వులు గుచ్చావా..
లాలనవై,పాలనవై,ఆశవై,ఆరాధనవై,ఆలాపనవై,
ఆలోచనవై,వీడని నీడవై,శ్వాసవై,మోహానాత్మ పిపాసవై..
నవ రసాలను ఏరిపోసుకోచ్చావా..
సుతిమెత్తని నీ చూపుల సవ్వడితో ,నా మనసును శృతి చేసి ఆడించే ఆత్మీయత నీది..
ఇలా మధురమైన క్షణాలన్నీ పోగుచేసుకొని ..
జ్ఞాపకాల పరిమళమై నీ వెంట సాగాలి నా పయనం కలకాలం...
Posted at 5:23 PM | లేబుళ్లు: poetry | 2 Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)

