నీ వెంటే నా పయనం..



జన్మాంతర బంధంలా,ఇరిగిపోని గంధంలా పయనమై వచ్చావా...
నీ ఆలాపనతోనే పరిమళించి ఊహల పూల నడుమ దవనంలా నీ నవ్వులు గుచ్చావా..
లాలనవై,పాలనవై,ఆశవై,ఆరాధనవై,ఆలాపనవై,
ఆలోచనవై,వీడని నీడవై,శ్వాసవై,మోహానాత్మ పిపాసవై..
నవ రసాలను ఏరిపోసుకోచ్చావా..
సుతిమెత్తని నీ చూపుల సవ్వడితో ,నా మనసును శృతి చేసి ఆడించే ఆత్మీయత నీది..
ఇలా మధురమైన క్షణాలన్నీ పోగుచేసుకొని ..
జ్ఞాపకాల పరిమళమై నీ వెంట సాగాలి నా పయనం కలకాలం..
.

2 కామెంట్‌లు:

భావన చెప్పారు...

నమస్తే. బ్లాగ్లోకానికి స్వాగతం. మీ మౌన గీతికలకోసం చూస్తుంటాము మరి.. వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి.. కామెంటే వారికి సౌలభ్యం గా వుంటుంది.

అక్షర చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

Design by Blogger Templates