అమ్మా....




మది లోని భావాలకు రుపునిచ్చే అక్షరాలను జల్లెడ పడుతున్నా..
నా ఆలోచలను కవితగా మలచాలని...
ఉదయిస్తున్న భానుని నునువెచ్చని కిరణాలు...
నిశీధి సమయాన చందమామ కురిపించే చల్లని వెన్నెల...
తొలకరి జల్లు నేలని ముద్దాడినపుడు వచ్చే కమ్మని మట్టి వాసన...
వసంతంలో చిగురు కొమ్మ మీది నుండి కోకిల పలికే కుహు కుహు రాగాలు...
చిరుగాలికి తలలూపే పచ్చని పైరు...
కడలి తరంగం వినిపించే అలల హోరు..
ప్రకృతి లోని ఈ అందాలన్నీ
అమ్మ ప్రేమ లాగానే ఎప్పటికీ శాశ్వతం...! శాశ్వతం...!!
అక్షర

Design by Blogger Templates