విధాత మెప్పు పొందగ లేమా ?
చూపులేని కన్నులు ఏమీ చూడలేక రోదిస్తూంటే .....
చూసీ ఆగలేని కన్నులు చూసిందల్లా కావాలని వేధిస్తున్నాయి....
తప్పటడుగుల పాదం బుడి బుడి అడుగులతొ ముందడుగుకై తపిస్తోంటే....
నడక నేర్చిన కాళ్ళు పెడదారుల్లో పరుగెడుతున్నాయి .....
మాటరాని నాలుక మదిలొ ఉప్పొంగే భావాల పరంపరను మౌనంగా దిగమింగేస్తుంటే....
మాటకారి నాలుక పది మందినీ ఆడిపోసుకొంటోంది.......
వినికిడి లేని చెవులు పెదాల నాట్యాలను పదాలుగా అనువదించుకుంటుంటే.....
వినేవాడి చెవులు రోజంతా వినికిడి జ్ఞానం కొల్పొతున్నాయి......
ఆపదలో ఉన్న చేయి ఆధారం కోసం ఆశగా ఎదురు చూస్తుంటే
అందీయవలసిన చేయి అహంకారపు హృదయ పీఠంపైనే ఆగిపోతున్నాయి .....
నిర్విరామ జీవన పయనంలో అలుపెరుగని మన నూరేళ్ల పోరాటంలో అస్త్రాలు లేని సైనికులని.....
మన ఆదరణే అండగా..... ప్రోత్సాహమే ఆయుధంగా....చేయూత నిస్తూ.... సహకరిస్తూ.....
ఆ నిండుగుండెలని మనతో కలుపుకొని మునుముందుకు సాగి
విధిని నెరవేర్చ లేమా ?.... విధాత మెప్పు పొందగ లేమా ?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి